SPORTS

చ‌రిత్ర సృష్టించిన అమ‌న్ సెహ్రావ‌త్

Share it with your family & friends

పారిస్ ఒలింపిక్స్ లో మ‌రో ప‌త‌కం

ఫ్రాన్స్ – పారిస్ లో జ‌రుగుతున్న ఒలింపిక్స్ 2024లో భార‌త దేశానికి చెందిన అమ‌న్ సెహ్రావ‌త్ చ‌రిత్ర సృష్టించాడు. రెజ్ల‌ర్ విభాగంలో స‌త్తా చాటాడు. 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో ప‌త‌కాన్ని సాధించి పెట్టాడు. దీంతో ఒలింపిక్స్ పోటీల‌లో భార‌త్ పత‌కాల సంఖ్య ఆరుకు చేరింది.

మ‌నూ భాక‌ర్ షూటింగ్ విభాగంలో 2 ప‌త‌కాల‌ను సాధించ‌గా నీర‌జ్ చోప్రా సైతం స‌త్తా చాటాడు. తాజాగా జ‌రిగిన పోటీల్లో అమ‌న్ సెహ్రావ‌త్ కాంస్య ప‌త‌కాన్ని సాధించాడు.

21 సంవత్సరాల 24 రోజుల వయస్సులో పివి సింధు రికార్డును అమన్ అధిగమించాడు. భారతదేశపు త‌ర‌పున అతి పిన్న వయస్సు క‌లిగిన క్రీడాకారుడిగా చ‌రిత్ర సృష్టించాడు.

తన తొలి ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌పై అమన్ 13-5 తేడాతో విజయం సాధించాడు.

ఇదిలా ఉండగా, పారిస్‌లోని పార్క్ డెస్ ప్రిన్సెస్‌లో జరిగిన పురుషుల ఫుట్‌బాల్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో స్పెయిన్ అదనపు సమయం తర్వాత 5-3తో ఫ్రాన్స్‌ను ఓడించింది.

మరోవైపు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS)లో వినేష్ ఫోగట్ విచారణ ముగిసింది. తుది తీర్పు త్వరలో వెలువడనుంది.