NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ కు నాకు గ్యాప్ లేదు

Share it with your family & friends

ఆమంచి కృష్ణ మోహ‌న్ కామెంట్

అమ‌రావ‌తి – చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహ‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగ‌ళ‌వారం ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌న్నారు.

అయితే త‌న భావ జాలానాకి టీడీపీతో కుద‌ర లేద‌ని స్ప‌ష్టం చేశారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని అన్నారు. వైసీనీ చీఫ్ , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి ముందుకు వెళ్లాన‌ని తెలిపారు. అయితే త‌న‌కు జ‌గ‌న్ తో ఎలాంటి గ్యాప్ లేద‌ని మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌కు ఎన‌లేని ప్ర‌యారిటీ ఇచ్చార‌ని పేర్కొన్నారు. వైసీపీ హైక‌మాండ్ త‌న‌ను ప‌ర్చూరు వైసీపీ నుంచి పోటీ చేయ‌మ‌ని కోరార‌ని తెలిపారు. నాకు చీరాల నియోజ‌క‌వ‌ర్గం అయితే బాగుంటుంద‌ని చెప్పాన‌న్నారు. కొద్ది రోజులుగా చీరాల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యాన‌ని అన్నారు.

అంద‌రూ క‌లిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ల‌మ‌ని చాలా మంది సూచించార‌ని చెప్పారు ఆమంచి కృష్ణ మోహ‌న్. క్లిష్ట ప‌రిస్థితుల్లోనే తాను కాంగ్రెస్ లోకి వెళ్లాల‌న‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని అన్నారు.