ఏపీకి అమరావతే రాజధాని
ప్రకటించిన నారా లోకేష్
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన కీలకంగా మారనున్నారు. ఈ తరుణంలో గత కొంత కాలంగా ఏపీకి రాజధాని అనేది లేకుండా పోయింది. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నారా లోకేష్.
గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయనను జనం పక్కన పెట్టారు. దారుణంగా ఛీ కొట్టారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పార్టీని ఆదరించారు. భారీ మెజారిటీని అందించారు.
దీంతో ప్రస్తుతం నారా లోకేష్ ఏపీకి ఏది రాజధాని అనే దానిపై స్పష్టత ఇచ్చారు. ఇక నుంచి ఏపీకి కేపిటల్ సిటీ అమరావతినే అంటూ ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు నారా లోకేష్.