సీఎంతో నెదర్లాండ్స్ రాయబారి భేటీ
వ్యవసాయ రంగానికి తోడ్పాటు
హైదరాబాద్ – సీఎంగా కొలువు తీరిన రేవంత్ రెడ్డిని పలువురు కలుస్తున్నారు. ఇప్పటికే వివిధ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సిఇఓలు కలిసి తమ సమ్మతిని తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని రంగాలలో ఉన్న వారందరికీ మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన రాయబారి మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కొంత సేపు చర్చలు జరిగాయి. దశాబ్దాలుగా భారత దేశం, నెదర్లాండ్స్ దేశాల మధ్య చక్కడి సత్ సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతిని సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామని, సాయం అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు నెదర్లాండ్స్ రాయబారి. ప్రధానంగా వ్యవసాయ రంగం కీలకంగా ఉందని, ఈ రంగంలో అభివృద్ది అవకాశాల గురించి విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని ఇరువురు అభిప్రాయపడ్డారు.
అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను స్థాపించడం, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావాలని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాయబారిని కోరారు.