NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై రాంబాబు సెటైర్

Share it with your family & friends

యోగి అవుతావా లేక పాండే అవుతావా

అమ‌రావ‌తి – ఏపీ మాజీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనితపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంపై తీవ్రంగా స్పందించారు.

త‌న‌కు హోం శాఖ మంత్రి గ‌నుక ఇస్తే తాట తీస్తానంటూ ప్ర‌క‌టించ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు . మీరు చేస్తున్న ప‌ని సూప‌ర్ గా ఉందంటూ ఎద్దేవా చేశారు. అన్నీ చేసేశారు..ఇక హోం మంత్రి ప‌ద‌వి మాత్ర‌మే మిగిలి ఉంద‌ని, వెంట‌నే తీసుకోండి అంటూ సూచించారు అంబ‌టి రాంబాబు.

ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ లాగా బుల్డోజ‌ర్ పాల‌న సాగిస్తారా లేక డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి మూవీలో బ్ర‌హ్మానందం న‌టించిన కిల్ బిల్ పాండే లాగా త‌యార‌వుతారా చూస్తామ‌న్నారు మాజీ మంత్రి.

రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా గాడి త‌ప్పింద‌ని, సీఎం చంద్ర‌బాబు నాయుడు హామీల అమలులో పూర్తిగా విఫ‌లం అయ్యారంటూ మండిప‌డ్డారు . హోం శాఖ‌నే ఎందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్..అన్ని శాఖ‌లు మీ వ‌ద్ద ఉంచుకుంటే బావుంటుందంటూ ఎద్దేవా చేశారు అంబ‌టి రాంబాబు.