కూటమి ఓటమి ఖాయం
మంత్రి అంబటి రాంబాబు
అమరావతి – ఏపీలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురందేశ్వరిపై నిప్పులు చెరిగారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మీ ముగ్గురు కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. ఇక ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
మూగ బోయిన ప్రజా గళం మీ ఓటమికి నాంది పలక బోతోందన్నారు. మైకు వినిపించక పోవడం భద్రతా వైఫల్యమా..లేక మీ చేతగానితనమా అంటూ మండిపడ్డారు అంబటి రాంబాబు. జనం రాక పోతే తమపై నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు .
ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నది నీవు కాదా చంద్రబాబూ అంటూ ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. 2014లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది నీవు కాదా అని ఎద్దేవా చేశారు. నీతి మాలిన రాజకీయాలు చేస్తూ, స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై చివరకు జైలు పాలై , మోదీ కాళ్లు మొక్కి బయటకు వచ్చిన విషయం జనానికి అంతా తెలుసన్నారు. మీ కూటమి తమను ఏమీ చేయలేదని స్పష్టం చేశారు మంత్రి.