ఆధారాలు లేకుండానే అరెస్ట్ లా
మాజీ మంత్రి అంబటి రాంబాబు
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాంబాబుతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆధారాలు లేకుండానే తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.
అర్ధరాత్రి అరెస్ట్ లు చేయడం, మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేరం ఏదీ రుజువు కాకుండానే ముసుగులు వేసి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
పోలీసులే అరబ్ దేశాల్లో శిక్షలు అమలు చేస్తాం అని ప్రకటిస్తున్నారని, ఈనాడు పత్రిలో వచ్చిన భాషను మాట్లాడటం దారుణమన్నారు అంబటి రాంబాబు. ఐపీఎస్ ప్రవీణ్ చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తి అని, ఆయన పులి మీద స్వారీ చేస్తున్నారని, చివరకు ఆ పులే తనను ఏదో ఒక రోజు తినేస్తుందని తెలుసుకుంటే మంచిదన్నారు అంబటి రాంబాబు.