మీ ఇంటికి..నోటికి తాళం వేస్తే బెటర్
చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సీరియస్ కామెంట్స్ చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్పా ఏపీ రాష్ట్రానికి కూటమి సర్కార్ ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు.
అక్రమంగా కట్టిన మీ ఇంటికి తాళం వేయాలని, ఆ తర్వాత మీ నోటికి తాళం వేసుకుంటే మంచిదని హితవు పలికారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందని , ఆ విషయం తెలుసు కోకుండా చంద్రబాబు నాయుడు మాట్లాడటాన్ని తప్పు పట్టారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. ముందు నీ నోటికి తాళం వేసుకుంటే ఏపీకి చాలా మంచి కలుగుతుందని పేర్కొన్నారు అంబటి రాంబాబు. ఎంత మందికని తాళాలు వేసుకుంటూ పోతావు చంద్రబాబూ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
ఇకనైనా మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించి చూసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు అంబటి రాంబాబు.