నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రాంబాబు
అమరావతి – రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందని, చంద్రబాబు నిర్వాకం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఫీజులు చెల్లించక పోవడంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బాబు పాలన బాగుందంటూ బాకాలు ఊదిన నేతలంతా ఇప్పుడు మౌనంగా ఉన్నారని, ప్రజా ప్రభుత్వమని ప్రచారం చేసుకున్న సర్కార్ చేతులెత్తేసిందన్నారు. ప్రజలు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు.
అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పేద విద్యార్థుకు ఫీజులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వెంటనే నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద త్వరితగతిన చెల్లించడం జరిగిందన్నారు. కానీ కూటడి సర్కార్ కొలువు తీరాక అప్పుల నెపంతో ఆలస్యం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉన్నత వర్గాల పిల్లలు చదువుకునేందుకు ఇబ్బంది ఉండదని, కానీ పేద పిల్లల విషయంలోనే చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. అయినా సీఎం చంద్రబాబుకు సోయి అనేది లేకుండా పోయిందన్నారు అంబటి రాంబాబు.