మాజీ మంత్రి అంబటి రాంబాబు పైర్
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ పాలనా పరంగా విఫలమైందన్నారు. చివరకు శాసన సభ సమావేశాలు నిర్వహించడంలో కూడా సక్సెస్ కాలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తిగత ప్రచారంపై పెట్టిన దృష్టి ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టడం లేదంటూ మండిపడ్డారు. ప్రశ్నావళితో అప్పులపై అబద్ధాల గుట్టు బయట పడిందన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడానికే పుణ్య కాలం సరి పోతోందంటూ సెటైర్ వేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు.
శనివారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. సభ జరిగిన విధానంపై ప్రజల స్పందన కూడా ఇదేనన్నారు. మండలి సమావేశాలపైనే ప్రజలు ఆసక్తి చూపారని చెప్పారు. ప్రజా సమస్యలపై తమ సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారని ప్రశసించారు అంబటి రాంబాబు. నిజాలను ఒప్పుకోక తప్పని పరిస్థితిని కల్పించామన్నారు. వైయస్సార్ పేరును తొలగించి చంద్రబాబు వికృత ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పథకాలు అమలు చేయలేక జిమ్మిక్కులు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ధ్వజమెత్తారు.