ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్
అంబటి రాంబాబు ఫైర్
తాడేపల్లిగూడెం – ఏపీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. చంద్రబాబు పల్లకీ మోసే బదులు తన పార్టీని టీడీపీలో విలీనం చేస్తే బెటర్ అంటూ సూచించారు. కేవలం బాబును సీఎం చేయాలని పవన్ కంకణం కట్టుకున్నాడని, అందుకే పార్టీని ఏర్పాటు చేశాడంటూ ఎద్దేవా చేశారు.
ఎవరి పల్లకీనో మోయడానికి నువ్వు పార్టీ పెట్టడం ఎందుకు అంటూ ప్రశ్నించారు అంబటి రాంబాబు. కమ్మ సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేదే ఆయన తపన అంటూ మండిపడ్డారు. ముద్రగడను బతికి ఉండగానే వేధించిన ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలకు విజన్ లేకుండా పోయిందన్నారు. కనీసం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో కూడా తెలియని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు పల్లకీ మోసే బదులు చిరంజీవిలా విలీనం చేసి సినిమాలు తీసుకో అంటూ హితవు పలికారు.
పొత్తు కుదుర్చు కుంటామంటూ బీజేపీ అంటోంది. కానీ ఆ పార్టీ ఎక్కడా టీడీపీ గురించి ఊసెత్తడం లేదన్నారు. మొత్తంగా తాము కన్ ఫ్యూజన్ లో ఉంటూ ప్రజలను విస్తు పోయేలా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.