న్యూ లుక్ లో మాజీ మంత్రి స్పెషల్
అమరావతి – మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బుధవారం స్వయంగా ఆయన ఏపీ హైకోర్టుకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించు కోవడం లేదంటూ ఆరోపించారు. అందుకే తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు వచ్చానని అన్నారు. ఆయన మాజీ మంత్రినే కాదు లాయర్ కూడా. పలు కేసులు వాదించారు. మంచి అనుభవం కూడా ఉంది తనకు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
అమరావతి హైకోర్టులో వాదనలు వినిపించిన అనంతరం మీడియాతో మాట్లాడారు అంబటి రాంబాబు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. ప్రజా పాలన కాదని ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత ఈ సర్కార్ కే దక్కిందన్నారు. తమ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కానీ ఆచరణకు నోచుకోని హామీలతో జనం చెవుల్లో పూలు పెట్టిన ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దక్కుతుందన్నారు అంబటి రాంబాబు.