ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా వైష్ణవి
అమరావతి రాజధానికి భారీ విరాళం
అమరావతి – ఏపీకి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తన వంతుగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం తన వంతుగా భారీ విరాళాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ సందర్బంగా సీఎం సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి అంబుల వైష్ణవి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుందని వెల్లడించారు.
పొలాన్ని అమ్మి రాజధానికి విరాళం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు సీఎం. అమరావతితో పాటు పోలవరం ప్రాజెక్టుకు కూడా విరాళం ఇచ్చారు వైష్ణవి. తల్లిదండ్రులతో కలిసి రెండు చెక్కులను నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి స్వస్థలం అంబుల వైష్ణవి. తను వైద్య విద్యను అభ్యసిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ. 25 లక్షలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1 లక్ష చొప్పున విరాళంగా అందజేశారు.
రాజధానిని నిర్మిద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ది చేద్దాం అనే ఆలోచనతో పని చేస్తున్న ప్రభుత్వానికి తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు అంబుల వైష్ణవి తెలిపారు. నేటి యువతకు వైష్ణవి స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు నారా చంద్రబాబు నాయుడు.