సీఏఏకు అమెరికా గాయని ప్రశంస
మోదీ ప్రభుత్వానికి ఊహించని మద్దతు
అమెరికా – దేశ వ్యాప్తంగా మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ తీసుకు వచ్చిన ఉమ్మడి పౌర స్మృతి (సీఏఏ)పై పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు, విమర్శలు, ఆరోపణలు, ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. విపక్ష పార్టీలన్నీ మూకుమ్మడిగా సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి.
అంతే కాదు సీఏఏ అమలు కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన భారత దేశ సర్వోన్నత న్యాయ స్థనం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సీఏఏపై ఎట్టి పరిస్థితుల్లోను స్టే విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఊహించని రీతిలో అమెరికా ప్రభుత్వం సైతం ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి అదే దేశానికి చెందిన ప్రముఖ గాయని మేరి మిల్ బెన్ ప్రశంసలు కురిపించింది సీఏఏపై. మత స్వేచ్ఛను సమర్థించినందుకు మోదీ సర్కార్ కు తాను కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని ప్రకటించింది.
దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా మోదీకి మరో రకంగా మద్దతు లభించినట్లయింది.