NEWSINTERNATIONAL

షేక్ హషీనాకు అమెరికా షాక్..వీసా ర‌ద్దు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్

అమెరికా – అమెరికా ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన షేక్ హ‌సీనాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. త‌న‌కు సంబంధించిన వీసాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది యుఎస్ స‌ర్కార్.

ఇదిలా ఉండ‌గా ముందు నుంచి అమెరికా బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాని ప‌ట్ల కోపంతో ఉంది. త‌ను పాకిస్తాన్ కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తోంది. మ‌రో వైపు బంగ్లా దేశ్ కు సంపూర్ణ స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తోంది భార‌త ప్ర‌భుత్వం.

తాజాగా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు షేక్ హ‌సీనాను గ‌ద్దె నుంచి దిగి పోవాల‌ని కోరాయి. విచిత్రం ఏమిటంటే త‌ను రాజీనామా చేసిన వెంట‌నే ఇంగ్లండ్ కు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు మాజీ ప్ర‌ధాన‌మంత్రి.

కానీ ఆమెకు ప్ర‌స్తుతం ఆ దేశం నుంచి కూడా లైన్ క్లియ‌ర్ ల‌భించలేదు. అయితే మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ మాత్రం బేష‌ర‌తుగా ఆమెకు మ‌ద్ద‌తు తెలియ చేసింది. ప్ర‌స్తుతం షేక్ హ‌సీనా సుర‌క్షితంగా ఇండియాలోనే కొలువుతీరారు.