Friday, May 23, 2025
HomeNEWSINTERNATIONALఅమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న

అమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న

ఎలోన్ మ‌స్క్ పై నిప్పులు చెరిగిన అమెరిక‌న్లు

అమెరికా – దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ కు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున అమెరికా వ్యాప్తంగా అమెరిక‌న్లు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ట్రంప్ గెలిచాక ఇదే అతి పెద్ద కార్య‌క్ర‌మం. ట్రంప్, మ‌స్క్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్ల‌కార్డుల‌తో హోరెత్తించారు. ట్రంప్ నిర్ణ‌యాల కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరుగుతోందంటూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వాణిజ్య యుద్దాలు పెరుగుతాయ‌ని వాపోయారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్రంప్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

అమెరికా దేశంలో 1200కి పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో నిర‌స‌న‌లు చేప‌ట్టారు. అమెరికా విదేశాంగ , దేశీయ విధానాన్ని ట్రంప్ విస్తృతంగా మార్చినందుకు ప్రతిస్పందనగా సామూహికంగా తమ అసంతృప్తిని ప్రదర్శించారు. ప్రభుత్వంపై సంప్రదాయవాద ముద్ర వేయడానికి పరిపాలన వేగవంతమైన ప్రయత్నాన్ని ప్రారంభించినప్పటి నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,అతని బిలియనీర్ మిత్రుడు ఎలోన్ మస్క్ కు వ్యతిరేకంగా ఆందోళ‌న‌లు నిర్వహించారు. కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, పోర్చుగల్‌తో పాటు మొత్తం 50 రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేప‌ట్టారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments