NEWSNATIONAL

అమిత్ షా ఘ‌న విజ‌యం

Share it with your family & friends

3,96,512 ఓట్ల తేడాతో గెలుపు

గుజ‌రాత్ – కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఘ‌న విజ‌యం సాధించారు. ఆయ‌న ఏకంగా త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్థి ర‌మ‌ణ్ భాయ్ పై భారీ తేడాతో విక్ట‌రీ సాధించ‌డం విశేషం. ఆయ‌న గుజ‌రాత్ లోని గాంధీ న‌గ‌ర్ లోక్ స‌భ స్థానం నుంచి బ‌రిలో ఉన్నారు. త‌న ప్ర‌త్య‌ర్థిపై 3,96,513 ఓట్ల మెజారిటీ పొంద‌డం గ‌మ‌నార్హం.

ఇక బీజేపీ అభ్య‌ర్థి అమిత్ చంద్ర షాకు 5,06,731 ఓట్లు వ‌చ్చాయి. ఇక ర‌మ‌ణ్ భాయ్ కి 1,10,219 ఓట్లు పోల్ అయ్యాయి. షాకు వ్య‌తిరేకంగా నిలిచిన బీఎస్పీ అభ్య‌ర్థి అనీశ్ దేశాయ్ కి ఊహించ‌ని రీతిలో డిపాజిట్ ద‌క్క‌లేదు. ఆయ‌న‌కు కేవ‌లం 3,244 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా ఎన్డీయేకు ఆశించిన మేర సీట్లు రాలేదు. మొత్తం 543 సీట్ల‌కు గాను 297 సీట్లలో ఆధిక్యం కొన‌సాగుతోంది. అయితే ఈ సీట్లు వ‌స్తాయా రావా అన్న అనుమానం క‌లుగుతోంది. విచిత్రం ఏమిటంటే ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి ఊహించ‌ని రీతిలో పెద్ద ఎత్తున సీట్ల‌ను కైవ‌సం చేసుకుని మోడీకి బిగ్ షాక్ ఇచ్చింది.