ఏపీకి జేపీ నడ్డా..అమిత్ షా రాక
చంద్రబాబు నివాసానికి చేరిక
విజయవాడ – దేశ రాజకీయాలన్నీ ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కార్ లో కీలకంగా మారారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఈనెల 12న ఆయన ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని అతిరథ మహారథులు , సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.
రాష్ట్రానికి విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. స్వయంగా చంద్రబాబు పిలవడం విశేషం. ఇదిలా ఉండగా కొత్త సర్కార్ కొలువు తీరే కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలచనున్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని వెల్లడించారు రాజమండ్రి ఎంపీ, బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి .
మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులుగా కొలువు తీరిన అమిత్ చంద్ర షా, జేపీ నడ్డా ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ఈ ఇద్దరూ నేరుగా చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు లోక్ సభ స్పీకర్ పదవి కావాలని కోరుతున్నట్లు సమాచారం.