NEWSANDHRA PRADESH

బాబు జ‌మానా అభివృద్దికి న‌మూనా

Share it with your family & friends

కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా

అమ‌రావ‌తి – రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శ‌త్రువులు శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నేది తేలి పోయింది. నిన్న‌టి దాకా క‌త్తులు దూసుకున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఏకంగా స‌మైక్య రాగం పాడుతున్నాయి. పొత్తుల గీతం ఆలాపిస్తున్నాయి. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మోడీని, షాను విమ‌ర్శించిన చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు వారితో జ‌త క‌ట్టారు. ఏపీలో జోరు పెంచారు. అంతే కాదు మూడు పార్టీలు పొత్తుగా ఎన్నిక‌ల రంగంలోకి ఎంట‌ర్ అయ్యాయి. ప్ర‌స్తుతం అధికార పార్టీతో ఢీకొంటున్నాయి.

ఇదిలా ఉండ‌గా తాజాగా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అమిత్ చంద్ర షా ఏపీలో ప‌ర్య‌టించారు. ఆయ‌న ఉన్న‌ట్టుండి టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో అభివృద్ది అన్న‌ది చంద్ర‌బాబు నాయుడు పాల‌నా కాలంలోనే జ‌రిగింద‌న్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చాక అభివృద్ది ఆగి పోయింద‌ని ఆరోపించారు. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా త‌మ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంద‌ని చెప్పారు. దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తోంద‌ని చెప్పారు షా.