NEWSNATIONAL

మా ఓటు బ్యాంకు ప‌దిలం

Share it with your family & friends

కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ – కేంద్ర హొం శాఖ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ఓటు బ్యాంకుకు ఎలాంటి ఢోకా లేద‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముస్లిం ఓటు బ్యాంకుకు బీజేపీ భ‌య ప‌డ‌ద‌ని పేర్కొన్నారు.

త‌మ ఓటు బ్యాంకును సంతోషంగా ఉంచు కోవ‌డం కోసం రాహుల్ , ప్రియాంక గాంధీ త‌మ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూట‌మికి క‌నీసం 10 సీట్లు కూడా రావ‌న్నారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ , సంకీర్ణ స‌ర్కార్ కు 400 సీట్ల‌కు పైగా వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ముస్లింలకు మేలు చేకూర్చేలా కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేసింద‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. దేశంలో మోడీ మేనియా న‌డుస్తోంద‌ని అన్నారు. దేశ‌మంత‌టా 143 కోట్ల మంది ప్ర‌జ‌లంతా తిరిగి పీఎంగా ఉండాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు అమిత్ చంద్ర షా.

కూట‌మి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు అర్థ ర‌హిత‌మ‌ని పేర్కొన్నారు.