NEWSNATIONAL

ప‌శ్చిమ బెంగాల్ లో గెలుపే ల‌క్ష్యం – షా

Share it with your family & friends

రాహుల్ గాంధీ ఇక ప్ర‌తిపక్ష నేత‌నే

ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌మ త‌దుప‌రి ల‌క్ష్యం ప‌శ్చి మ బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీకి షాక్ ఇవ్వాల‌ని, బీజేపీ బెంగాల్ లో పాగా వేయ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం అమిత్ షా కోల్ క‌తా లో మీడియాతో మాట్లాడారు.

బెంగాల్ లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని ముందుకు సాగుతున్నామ‌ని, ప‌రిస్థితులు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉన్నాయ‌ని చెప్పారు.

రాహుల్ గాంధీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌పై సెటైర్ వేశారు. రాహుల్ గాంధీ కాద‌ని ఆయ‌న రాహుల్ బాబా అంటూ సెటైర్ వేశారు. రాహుల్ ఆయ‌న కంప‌నీకి చెందిన పార్టీలు, నేత‌లు క‌ల‌లు కంటున్నాయ‌ని, ఇప్ప‌ట్లో అది సాధ్యం కాద‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టికే మ‌ధ్య‌ప్ర‌దేశ్ , రాజ‌స్‌థాన్, ఛ‌త్తీస్ గ‌ఢ్, ఒడిశాలో విజ‌యం సాధించామ‌న్నారు. హ‌ర్యానాలో బీజేపీ వ‌రుస‌గా మూడోసారి గెలిచి చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. మ‌రాఠాలో కూడా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ధీమా వ్య‌క్తం చేశారు అమిత్ చంద్ర షా.

“ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా ప్రతిపక్షంలో కూర్చోవాలని, ఎవరు గెలిచినా దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తారని నేను ‘రాహుల్ బాబా’కి చెప్పాలనుకుంటున్నాను” – హెచ్‌ఎం షా స్ప‌ష్టం చేశారు.