ట్రబుల్ షూటర్ షా సక్సెస్
మోడీ పీఎం అయ్యేలా వర్కవుట్
న్యూఢిల్లీ – మరోసారి చర్చనీయాంశంగా మారారు బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడ గట్టేందుకు నానా తంటాలు పడ్డారు . ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని ప్రచారం చేశారు. కానీ వర్కవుట్ కాలేదు.
అయోధ్య రాముడిని ప్రచార అస్త్రంగా మార్చారు. అక్షింతలు పంచారు. మోడీనే పీఎం అంటూ ఊదరగొట్టారు. ప్రపంచం తమ నాయకుడిని చూసి నేర్చుకుంటోందంటూ బాకాలు ఊదారు. చివరకు మేజిక్ ఫిగర్ ను దాటలేక పోయారు.
ఒక రకంగా చావు తప్పి కన్నుకు గాయమైందన్న చందంగా తయారైంది బీజేపీ పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనంతటి వ్యతిరేకత మొదలైందని తేలి పోయింది. ఎలాగైనా మూడోసారి మోడీని పీఎం చేయాలన్న సంకల్పం సక్సెస్ అయ్యింది. ఈసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ సహకరించారు. వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యారు అమిత్ చంద్ర షా.