మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు
కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా
ఢిల్లీ – భారత దేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్ను మూయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఆయన మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. దేశం గర్వించ దగిన నేతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. చివరి దాకా విలువలకు కట్టుబడిన నాయకుడిగా ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, ఎక్కువగా మాట్లాడక పోవడం, ఆచరణాత్మకంగా ఉండడం గొప్పనైన విషయాలని పేర్కొన్నారు పీఎం నరేంద్ర మోడీ. భారతదేశం తన విశిష్ట నాయకులలో ఒకరైన మన్మోహన్ సింగ్ జీని కోల్పోవడం తనను మరింత బాధకు లోను చేసిందన్నారు.
నిరాడంబరమైన మూలాల నుండి ఎదిగి, గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రిగా సహా పలు ప్రభుత్వ పదవుల్లో కూడా పనిచేసి, బలమైన ముద్ర వేశారు. అనేక సంవత్సరాలుగా మన ఆర్థిక విధానంపై ఆయన ప్రభావం ఎల్లప్పటికీ ఉంటుందన్నారు. ప్రజల జీవితాలు మెరుగు పర్చేందుకు తను ప్రధానిగా శాయశక్తులా కృషి చేశారని కొనియాడారు.
మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.