అరుణ్ యోగిరాజ్ కు షా ప్రశంస
శ్రీరాముడిని అద్భుతంగా చెక్కారు
కర్ణాటక – అయోధ్య లోని శ్రీరాముడి విగ్రహం పునః ప్రతిష్ట కార్యక్రమం పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. కానీ ఒకే ఒక్కరు మాత్రం దేశమంతటా చర్చనీయాంశంగా మారారు. ఆ వ్యక్తి ఎవరో కాదు కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పకారుడు అరుణ్ యోగి రాజ్. ఎందుకంటే ఆ శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ట చేసింది ఇతనే.
ఇదిలా ఉండగా కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రశంసల జల్లు కురిపించారు అరుణ్ యోగి రాజ్ ను . శ్రీరాముడికి ప్రాణం పోశారంటూ కితాబు ఇచ్చారు. తర తరాలుగా వస్తున్న సంప్రదాయానికి మెరుగులు దిద్దారని, నభూతో నభవిష్యత్ అన్నంతగా రాముడి విగ్రహాన్ని తయారు చేశారంటూ ప్రశంసించారు.
చరిత్ర ఉన్నంత వరకు రాముడు మన మదిలో, హృదయాలలో నిలిచి ఉంటారని అన్నారు షా. దీని కోసం కష్టపడి పని చేసిన అరుణ్ యోగి రాజ్ ను ప్రత్యేకంగా అభినందనలతో ముంచెత్తారు. ఆయనను ఘనంగా సన్మానించారు.