కాషాయం క్లీన్ స్వీప్ ఖాయం
కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా
తమిళనాడు – దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ ఈసారి భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకోనుందని చెప్పారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీజేపీ చీఫ్ కె. అన్నామలైతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈసారి కూడా బీజేపీ సంకీర్ణ సర్కార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈ దేశానికి ఏం కావాలనేది మోదీకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు షా.
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న దేశాలలో భారత్ టాప్ లో కొనసాగుతోందని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరమైన పాలనను అందిస్తున్న బీజేపీనే మరోసారి కావాలని 143 కోట్ల మంది భారతీయులు కోరుకుంటున్నారని అన్నారు .
రాష్ట్రంలో డీఎంకే అంటేనే అవినీతికి కేరాఫ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సందర్బంగా మాయ మాటలు చెప్పారని, వాటిలో ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ మండిపడ్డారు అమిత్ చంద్ర షా.