స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా
అమరావతి – ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనే సత్తా భారత దేశానికి ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. డిజాస్టర్ మేనేజ్మెంట్ భవనాన్ని ప్రారంభించారు. మోడీ, చంద్రబాబు నేతృత్వంలో అనూహ్యమైన విజయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో కోల్పోయిన దాని గురించి ఆలోచించ వద్దన్నారు. ఏపీకి అన్ని విధాలుగా కేంద్రం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
కూటమి మూడింతలు మంచి చేస్తుందని చెప్పారు అమిత్ షా. రాత్రి పగలు పనిచేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విజన్ సిఎం కు ఉందంటూ కితాబు ఇచ్చారు. ఆర్నెల్ల కాలం లో మూడు లక్షల కోట్లు కేటాయించి సహకరించామన్నారు. విశాఖ స్టీల్ కు రూ. 11,440 కోట్లు ఇచ్చామన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఆత్మ గౌరవం తో ముడిపడిందని , ముందుకు తీసుకు వెళతామన్నారు. మోడీ భూమి పూజ చేసిన అమరావతి ప్రాజెక్టు నిర్మించేందుకు రూ. 27 వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, హడ్కో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు.
రైల్వే జోన్ ను ఏపి కి అందించామని తెలిపారు. రాష్ట్ర జీవనాడి పోలవరం..2028 నాటికి గోదావరి నీళ్ళు రాష్ట్రం అంతా అందిస్తామని ప్రకటించారు. ఎయిమ్స్ హాస్పిటల్ తో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ప్లాంట్ ను రూ. 2 లక్షల కోట్లతో చేపట్టేందుకు ప్రధాని శంకుస్థాపన చేశారని చెప్పారు. లక్ష కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఎన్ డి ఆర్ ఎఫ్ పట్ల నమ్మకం పెంచిన సైనికులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని అన్నారు అమిత్ చంద్ర షా.