ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్ షా
తెలంగాణ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
నరేంద్ర మోడీని మూడోసారి గెలిపిస్తే తెలంగాణలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెడతామని చెప్పారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని, ఆ రెండు పార్టీలకు మూడిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని జోష్యం చెప్పారు అమిత్ చంద్ర షా.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోయాయని సంచలన ఆరోపణలు చేశారు. ఆ రెండూ నాటకాలు ఆడుతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం, భూ కుంభ కోణాలలో ఎందుకని చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని.