రిజర్వేషన్ల విధానంలో మార్పు ఉండదు
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. తాము రిజర్వేషన్ల విధానానికి స్పందించి ఎలాంటి మార్పులు చేయ బోవడం లేదని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు షా.
కేవలం రాజకీయ లబ్ది కోసం విపక్షాలు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకు వస్తున్నాయని ఆరోపించారు. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇవాళ సుస్థిరతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో రూఢీ అయ్యిందన్నారు అమిత్ షా.
అయినా ఇండియా కూటమి పార్టీలకు బుద్ది రావడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏమైనా నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇస్తే తాము తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు లోక్ సభలో.
రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే ఏ పనీ తాము చేయబోమంటూ ప్రకటించారు.