NEWSNATIONAL

సోనియా ఎంపీ నిధులు మైనార్టీల‌కు

Share it with your family & friends

కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కామెంట్

న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏఐసీసీ మాజీ చీఫ్‌, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీని టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌భ‌లో తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.

సోనియా గాంధీ హిందువుల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించారని, దీనికి త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని చెప్పారు అమిత్ షా. సోనియా గాంధీ 70 శాతానికి పైగా ఎంపీ నిధుల‌ను మైనార్టీల కోసం ఖ‌ర్చు చేశారంటూ ఆరోపించారు.

ఇప్పుడు ప్ర‌జ‌లు తెలుసు కోవాల్సింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మైనార్టీల కోస‌మే ప‌ని చేస్తోంద‌న్న విషయం అర్థ‌మై పోయింద‌న్నారు అమిత్ షా. ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు అయోధ్య‌ను సంద‌ర్శించ లేద‌ని ప్ర‌శ్నించారు.

ఎందుకంటే మైనార్టీల ఓట్లు కోల్పోతామోన‌న్న భ‌యంతోనే సంద‌ర్శించ లేదంటూ మండిప‌డ్డారు. మొత్తంగా మొన్న‌టికి మొన్న మోదీ కాంగ్రెస్ వ‌స్తే హిందువుల పుస్తెలు గుంజుకుంటారంటూ ఆరోపించారు. తాజాగా షా మైనార్టీల‌పై త‌న అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం విశేషం.