Sunday, April 20, 2025
HomeDEVOTIONALవెన‌క్కి త‌గ్గిన కేంద్ర హోం శాఖ

వెన‌క్కి త‌గ్గిన కేంద్ర హోం శాఖ

టీటీడీపై స‌మీక్ష చేయ‌బోమంటూ లేఖ

అమ‌రావ‌తి – అమిత్ షా ఆదేశాల మేర‌కు కేంద్ర హోం శాఖ వెన‌క్కి త‌గ్గింది. సీఎం చంద్ర‌బాబు నాయుడు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు టీటీడీ వ్య‌వ‌హారాల‌పై జోక్యం చేసుకోవ‌డం గురించి. వైకుంఠ దర్శనం టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదనపు కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు చేయాలంటూ హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. షా దెబ్బ‌కు స‌మీక్ష‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

హోం శాఖ లేఖ పై ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న హోం మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీంతో జోక్యం చేసుకున్న షా సీరియ‌స్ అయ్యారు. ఆ లేఖను తక్షణమే విరమించాలంటూ తన శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు హోం అఫైర్స్ కంట్రోల్ రూం ఆఫీసర్ తాజా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో టీటీడీపై కేంద్ర హోం శాఖ సమీక్ష కు సంబంధించిన అంశం లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ అధికారులతో హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ సమావేశం ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments