Monday, April 28, 2025
HomeNEWSANDHRA PRADESHమీడియాకు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌రం

మీడియాకు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌రం

స్ప‌ష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఢిల్లీ – కేంద్ర హొం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీడియాకు స్వీయ నియంత్ర‌ణ అనేది అవ‌స‌ర‌మ‌న్నారు. భారత పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయ‌ని, సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. భారత్ సైన్యం అందుకు తగ్గట్టుగానే దీటుగా బదులిస్తోందన్నారు. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేస్తున్న‌ట్లు తెలిపారు. మీడియా కవరేజ్ విషయంలో పలు సూచనలు చేశారు. అదే టైంలో సోషల్ మిడియా యూజర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణపరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు.. మీడియా కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికారు. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని సూచించారు.

మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్ఫామ్స్ , వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం (Live Coverage) చేయకూడదని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది.

ప్రత్యేకంగా రియల్-టైమ్ కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు , సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయొద్దని చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని అన్నారు. దేశం ప్లాన్ ల‌ను అమలు చేయడంలో ఇబ్బంది కలగడమే కాకుండా సైన్యం భద్రతకు ప్రమాదం కలిగించవచ్చు అని తెలిపారు. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఇలాంటి ఘటనలు ముప్పు తెచ్చినట్టు మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.

అపరిమిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగించిందని’ ఆందోళన వ్యక్తం చేసింది . గత ఘటనలు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ప్రాముఖ్యత గుర్తు చేస్తున్నాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అపరిమిత కవరేజ్ ప్రతికూల పరిణామాలకు కారణమైంది అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments