కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
ఢిల్లీ – కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నక్సలిజం అంతిమ దశకు చేరుకుందన్నారు. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు. మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు.
నక్సలైట్లు లేని భారత్ దిశగా కీలక అడుగు వేశామన్నారు. నక్సలిజం నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్నది తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సంకల్పానికి భద్రతా బలగాల పోరాటం తోడైందన్నారు.
గత కొంత కాలంగా దేశంలో అల్లకల్లోలం చోటు చేసుకుందన్నారు. కానీ తాము వచ్చాక అది లేకుండా చేశామని , సక్సెస్ అయ్యాయమని అన్నారు. నక్సలిజం పేరుతో నయా తీవ్రవాదం దేశాన్ని విచ్చిన్నం చేసే దిశగా ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
కానీ వ్యూహాత్మకంగా భద్రతా దళాలు వ్యవహరించాయని, ప్రధానంగా కొన్నేళ్లుగా అస్థిరత సృష్టించేందుకు చేసిన నక్సలిజం అనేది లేకుండా పోయేందుకు చివరి దశలో ఉందన్నారు అమిత్ చంద్ర షా. ఇక మిగిలింది ఒకే ఒక్క శాతంగా ఉంటుందని, అది కూడా పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు.