NEWSNATIONAL

దీదీని న‌మ్ముకుంటే అధోగ‌తే

Share it with your family & friends

నిప్పులు చెరిగిన అమిత్ షా

ప‌శ్చిమ బెంగాల్ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధ‌వారం ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు షా.

ఉమ్మ‌డి పౌర స‌త్వ చ‌ట్టం గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు కేంద్ర మంత్రి. ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌జ‌ల‌ను సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌ప్పుదోవ ప‌ట్టిస్తంద‌ని ఆరోపించారు. పౌర‌స‌త్వం పోతుంద‌ని నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

వ‌చ్చిన శ‌ర‌ణార్థులంతా నిర్భ‌యంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు అమిత్ చంద్ర షా. ఎవ‌రి పైనా కేసు పెట్ట‌బోమంటూ చెప్ప‌డానికే తాను ఇక్క‌డికి వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇది మోడీ ప్ర‌భుత్వ చ‌ట్ట‌మ‌ని స్ప‌ష్టం చేశారు కేంద్ర హొం శాఖ మంత్రి.

దీనిని ఎవ‌రూ మార్చ లేర‌న్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ రోహింగ్యాల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచింద‌ని, వారికి వెల్ క‌మ్ చెప్పింది నిజం కాదా అని ప్ర‌శ్నించారు అమిత్ చంద్ర షా. శ‌ర‌ణార్థుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించింది దీదీనేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక బెంగాల్ లోని శ‌ర‌ణార్థులు, రోహింగ్యాలంతా నిర్భ‌యంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.