NEWSNATIONAL

ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై షా కామెంట్స్

Share it with your family & friends

రూ. 1600 కోట్ల లెక్క‌లు చెప్పండి

న్యూఢిల్లీ – ఎల‌క్టోర‌ల్ బాండ్ల వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తోంది. సుప్రీంకోర్టు దెబ్బ‌కు అబ్బా అంటోంది మోదీ స‌ర్కార్. బాండ్ల రూపేణా భారీ ఎత్తున దేశంలోని రాజ‌కీయ పార్టీలు విరాళాలు అందుకున్నాయి. వీటిలో ఎక్కువ శాతం కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ పార్టీ బీజేపీకి ద‌క్క‌డం విశేషం. ఏకంగా రూ. 6,312 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఎస్బీఐ ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించింది . సుప్రీంకోర్టు సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డంతో దిగి వ‌చ్చింది ఎట్ట‌కేల‌కు జాబితా అంద‌జేసింది. కానీ పూర్తి వివ‌రాలు అంద‌జేయ‌లేదు. గురువారం నాటితో స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. లేక పోతే ఎస్బీఐ చైర్మ‌న్ పై చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించింది.

ఈ సంద‌ర్బంగా ఓ మీడియా సంస్థతో జ‌రిగిన చ‌ర్చ‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌పై స్పందించారు. వివ‌రాల‌న్నీ బ‌య‌ట పెడితే ప్ర‌తిపక్షాలు ఈ దేశంలో ప్ర‌శ్నించే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇవ్వ‌లేవంటూ ఎద్దేవా చేశారు. త‌మ సంగ‌తి ప‌క్క‌న పెడితే ముందు కాంగ్రెస్ పార్ట‌కి వ‌చ్చిన రూ. 1600 కోట్ల సంగ‌తి ఏమిటో చెప్పాల‌ని షా డిమాండ్ చేశారు.