ఈసారి జార్ఖండ్ లో కమల వికాసం
జార్ఖండ్ – కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జార్ఖండ్ లోని సరైకేలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలను ఏకి పారేశారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రాన్ని దివాళా తీయించాయని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు అమిత్ చంద్ర షా.
జేఎంఎం, కాంగ్రెస్ హయాంలో అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అంతే కాకుండా ఆదివాసీలకు సంబంధించిన హక్కులను కాలరాశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈసారి రాష్ట్ర ప్రజలంతా మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని డిసైడ్ అయ్యారని చెప్పారు అమిత్ చంద్ర షా.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రెండు పార్టీలు ఇష్టానుసారంగా దోచుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన వనరులను ధ్వంసం చేశారని అన్నారు. ఈసారి గనుక వారికి ఓటు వేస్తే ఇక జార్ఖండ్ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా.