ట్రబుల్ షూటర్ కింగ్ మేకర్
మోడీ కేబినెట్ లో నెంబర్ 2
న్యూఢిల్లీ – పేరుకు మోడీ అయినా దేశాన్ని వెనుక నుండి నడిపించేది మాత్రం అమిత్ చంద్ర షా. భారతీయ జనతా పార్టీలోనే కాదు కేబినెట్ ను తన కనుసన్నలలో శాసించే ఏకైక వ్యక్తి ఇతనే కావడం విశేషం. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో, కష్ట కాలంలో పార్టీని గట్టెక్కించడంలో తనే కీలకం . ఆయనను కాదని ఎవరూ ఏ పని చేయలేరు.
పేరుకు మాత్రమే కేబినెట్ లో మంత్రలు. అంతా నడిపేది..నడిపించేది అమిత్ చంద్ర షానే. మోడీ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు ఏకైక సమాధానం ఆయనే. కాషాయ పార్టీలో అత్యంత మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క పేరు అమిత్ చంద్ర షా.
సాంప్రదాయ బద్దమైన కాషాయ పార్టీని కార్పొరేట్ కంపెనీగా మార్చేసిన ఘనత ట్రబుల్ షూటర్ కే దక్కుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర కూడా అమిత్ షాది. దీనిని విపక్షాలే పదే పదే విమర్శిస్తున్నాయి. మోడీకి అత్యంత నమ్మకమైన నాయకుడు, ఏకైక వ్యక్తి అమిత్ చంద్ర షా మాత్రమే.
గత సర్కార్ లో హోం శాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే శాఖలో కొనసాగనున్నారు. ఎందుకంటే తనకు టార్గెట్ చేయడం ఇష్టం.