మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన
అమరావతి – జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని మంత్రి కందుల దుర్గేష్. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి పెద్ద ఎత్తున. ఈ సినిమా వచ్చే జూన్ 12న రిలీజ్ కానుంది. దీనిపై తీవ్రంగా స్పందించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు.
ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించ బోతున్నారు ఈ సందర్బంగా.
ఇదిలా ఉండగా కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశాడు మంత్రి కందుల దుర్గేష్. దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నిధి అగర్వాల్ నటించారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు.