NEWSANDHRA PRADESH

పున‌రావాస కేంద్రాలుగా క్యాంపు ఆఫీసులు

Share it with your family & friends

వాడు కోవాల‌ని సూచించిన మంత్రి అన‌గాని

అమ‌రావతి – ఏపీ మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజయవాడ, గుంటూరు, రేపల్లెలోని త‌న‌ క్యాంపు కార్యాలయాలను పునరావాస కేంద్రలుగా వాడు కోవాల‌ని సూచించారు అధికారుల‌కు.

రెవెన్యూ అధికారులు తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాల‌ని, కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్టతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

భారీ వర్షాల నేపథ్యంలో తన ఆఫీసుల‌ను వాడుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి. గతంలో వరదల వల్ల కోతలకు గురైన కరకట్టల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని అన్నారు.

వర్షాల కారణంగా పలుచోట్ల కరకట్టలు దెబ్బ తిన్నాయ‌ని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన చోట్ల కరకట్ట పనులను వెంటనే చేపట్టాలని అన్నారు మంత్రి. కరకట్టలు బలహీనంగా ఉన్నచోట్ల కట్ట పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కట్ట కింద ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయం చేసుకోవాల‌ని సూచించారు. భారీ వర్షాలు , వరదల సమయంలో నదీ తీర గ్రామాల ప్రజలు ముంపు బారిన పడుతున్నారని వాపోయారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని కరకట్టల పటిష్టతపై ప్రభుత్వం దృష్టి పెట్టక పోవడంతో ఇప్పుడు మరింత ప్రమాదం ఏర్పడిందని ఆరోపించారు అన‌గాని స‌త్య ప్ర‌సాద్.

ఈ క్రమంలో మరమ్మతు పనులు చేపడుతూనే తీర గ్రామాల వెంబడి మరిన్ని కరకట్టలను నిర్మించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ వర్షాల వల్ల పాము కాట్లకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటిస్టూ పాము కాటు మందులను అందుబాటులో ఉంచు కోవాల‌ని సూచించారు.