ఏపీలో పెన్షన్ల పంపిణీకి రూ. 4400 కోట్లు
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి
అమరావతి – ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచడం జరుగుతుందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలకు సామాజిక భద్రత పెన్షన్లకు రూ. 2,700 కోట్లు ఖర్చు చేస్తే తమ కూటమి సర్కార్ పెంచిన పెన్షన్లతో మొత్తం నెలకు రూ. 4,400 కోట్లు ఖర్చు చేయనుందని వెల్లడించారు ఆనం రామ నారాయణ రెడ్డి.
చంద్రబాబు హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు రూ.864 కోట్లు. 11వ పీఆర్సీ కారణంగా జీతాలు 1000 కోట్లకు పెరిగాయన్నారు. జగన్ రాగానే 40 వేలకు మించి జీతం తీసుకునే వాళ్ళందరినీ తప్పించి తన వాళ్ళను పెట్టుకున్నాడని ఆరోపించారు .
2023-24లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల ఖర్చు ఏకంగా రూ.2861 కోట్లకు పెరిగిందన్నారు. అంటే ఎన్నికల్లో విషప్రచారం చేయించడానికి జగన్ ఏకంగా రూ.1861 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా తన వాళ్లకు ధార పోశాడని తేలి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు రామ నారాయ ణ రెడ్డి.