ఆ ఇద్దరి జీవితం స్పూర్తి దాయకం
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా
హైదరాబాద్ – ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నిత్యం సోషల్ మీడియా వేదికగా పలు విషయాలు పంచుకుంటారు. స్పూర్తి దాయకంగా ఉండేలా కొత్త వారిని పరిచయం చేస్తారు. అంతే కాదు వారిని ప్రోత్సహిస్తారు. అవసరమైతే సాయ పడతారు కూడా.
తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా . ఆ ఇద్దరు భార్య భర్తలు . వారు తమ తమ రంగాలలో అద్భుతంగా రాణించారు. వారు ఎవరో కాదు నిజ జీవితంలో అసలైన హీరోలంటూ కితాబు ఇచ్చారు ఆనంద్ మహీంద్రా.
ఐపీఎస్ అయిన మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అయిన ఆయన భార్య శ్రద్దా జోషి లను తాను కలుసు కోవడం , వారితో ఆటోగ్రాఫ్ తీసుకోవడం మరింత సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే తాను వారి నుంచి ఆటోగ్రాఫ్ అడగడంతో వారు సిగ్గు పడ్డారని తెలిపారు.
భారతదేశం ప్రపంచ శక్తిగా మారాలంటే, ఎక్కువ మంది ప్రజలు తమ జీవన విధానాన్ని అవలంబిస్తే అది మరింత వేగంగా జరుగుతుందన్నారు ఆనంద్ మహీంద్రా. కాబట్టి వారే ఈ దేశానికి నిజమైన సెలబ్రిటీలు. అంతే కాదు వారి ఆటోగ్రాఫ్‌లు వారసత్వ సంపద.