అందెశ్రీ కామెంట్స్ కలకలం
కీరవాణిపై కవి..గాయకుడు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సాధనలో కవులు, కళాకారులు, రచయతలు , గాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దివంగత గద్దర్, గూడ అంజయ్య తో పాటు ప్రస్తుతం పాటతో దుమ్ము రేపుతున్న వారిలో గోరేటి వెంకన్న, అందెశ్రీ , తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొందరు కళాకారులు అన్నీ తామై వ్యవహరించారు. వారిలో ఒకరు రసమయి బాలకిషన్. తను గాయకుడిగా పేరొందాడు. ఉద్యమ కాలంలో కీలక పాత్ర పోషించాడు. కేసీఆర్ ఆయనకు మంచి పదవి కట్టబెట్టారు.
ఆ తర్వాత సీన్ మారింది. కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి వచ్చింది. గత సర్కార్ హయాంలో వెలుగొందిన వారంతా వెనక్కి పోయారు. కొత్త వారు తెర మీదకు వచ్చారు. అందులో ప్రముఖంగా చెప్పు కోవాల్సింది కవి, గాయకుడు అందెశ్రీ. తను రాసిన జయ జయహే తెలంగాణ పాట పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. ఇందుకు గాను కీరవాణిని సంగీత దర్శకుడిగా నియమించారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ఆత్మ గీతానికి కీరవాణి మ్యూజిక్ ఎట్లా ఇస్తాడని.
దీనిపై అందెశ్రీ స్పందించాడు. తెలంగాణలో కీరవాణిని మించిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారంటూ ప్రశ్నించారు.