ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి – దేశమంతటా వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రాష్ట్రంలో కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆయా రేషన్ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేస్తోంది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి.
తాజాగా పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలకు వీలుగా ఉండేలా వంట నూనెల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. ఈ సందర్బంగా ధరలు తగ్గించి అమ్మేలా చర్యలు చేపట్టింది.
ఏపీలో వంట నూనెల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాల వద్ద రిఫైండ్ ఆయిల్, పామాయిల్ ను సబ్సిడీ పై ప్రభుత్వం అందించనుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రిఫైండ్ ఆయిల్‌ను రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.