చుక్కలు చూపించిన రస్సెల్
19 పరుగులు 3 వికెట్లు
చెన్నై – ఐపీఎల్ 2024 ఫైనల్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఐపీఎల్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్ నిలిచింది. 8 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్ కతా బౌలర్ల దెబ్బకు సన్ రైజర్స్ విల విల లాడింది. ఏ కోశాన పోరాట పటిమను ప్రదర్శించ లేక పోయింది. పరుగులు చేసేందుకు నానా తంటాలు పడింది. నిన్నటి దాకా పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , క్లాసెన్ , తదితర బ్యాటర్లు చేతులెత్తేశారు.
సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ఫోర్లు , సిక్సర్లతో దంచి కొట్టిన ట్రావిస్ హెడ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు . ఇక అలవోకగా సిక్సర్లు బాదుతూ వచ్చిన అభిషేక్ శర్మ నిరాశ పరిచాడు. వికెట్ మిచెల్ స్టార్క్ బంతికి సమర్పించుకున్నాడు.
ఇక వస్తూ వస్తూనే ఆండ్రీ రస్సెల్ మిస్సైల్ లాంటి బంతులను వేశాడు. 4 ఓవర్లు వేసిన రస్సెల్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3 కీలకమైన వికెట్లను కూల్చాడు. ఇక మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 14 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
హర్షిత్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. తను 24 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 2 వికెట్లు కోల్పోయి పని కానిచ్చేసింది.