విడాకుల కోసం 8 ఏళ్ల కిందట దరఖాస్తు
అమెరికా – ప్రముఖ హాలీవుడ్ జంట ఏంజెలీనా జోలీ , బ్రాడ్ పింట్ కు విడాకులు మంజూరయ్యాయి. ఎనిమిది ఏళ్ల కిందట విడాకులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల బాధ్యత ఎవరికి ఇవ్వాలనే దానిపై కోర్టు ఇంత కాలం వేచి చూసింది.
ఈ ఇద్దరూ 2014లో ఒక్కటయ్యారు. రెండేళ్లకే విడాకులు కావాలంటూ కోర్టుకు ఎక్కారు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. మేజర్ అయ్యేంత దాకా సంరక్షించే బాధ్యత ఇద్దరిదేనని ఆదేశించింది కోర్టు.
ఇదిలా ఉండగా 2005లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందింది మిస్టర్ అండ్ మిసెస్ చిత్రం. ఈ సినిమా ద్వారా ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పింట్ ప్రేమించుకున్నారు. ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. పిల్లల సంక్షరణ ఎవరిదనే దానిపై ఇద్దరు పట్టించుకోలేదు.
అమెరికా కోర్టు ఇద్దరికీ బిగ్ షాక్ ఇచ్చింది. పిల్లల సంరక్షణ ఇద్దరిదీ అంటూ పేర్కొంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలు మేజర్ అయ్యేంత వరకు తల్లిదండ్రలే బాధ్యత తీసుకోవాలని నటీనటులతో పాటు ఇతర పేరెంట్స్ కూడా సూచించింది. ఎందుకంటే వారికి ఆలనా పాలనా అవసరం ఉంటుందని పేర్కొంది కోర్టు. తాజా తీర్పుతో ఏంజెలీనా, బ్రాడ్ లు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.