బాబు డైనమిక్ లీడర్
వేదాంత గ్రూప్ చైర్మన్
ముంబై – ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన నారా చంద్రబాబు నాయుడుకు ప్రశంసలు కురుస్తున్నాయి. దేశ విదేశాలకు చెందిన వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన చైర్మన్లు, సీఈవోలు, మేనేజింగ్ డైరెక్టర్లు అభినందిస్తున్నారు.
ఈ సందర్బంగా గురువారం ట్విట్టర్ వేదికగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సీఎంను అభినందించారు. మరో వైపు వేదాంత గ్రూప్ లిమిటెడ్ చైర్మన్ , ఆంట్రప్రెన్యూర్ కు చెందిన అనిల్ అగర్వాల్ చంద్రబాబు నాయుడుకు కితాబు ఇచ్చారు.
అతనితో పని చేసిన నా అనుభవంలో, దేశంలోనే అత్యంత చైతన్య వంతమైన , ముందుకు చూసే నాయకులలో ఒకరిగా తాను గుర్తించానని స్పష్టం చేశారు. చంద్రబాబు విధానం నిత్యం స్పూర్తి దాయకంగా ఉంటుందన్నారు.
సమృద్ధిగా ఉన్న వనరులు, బలమైన మానవ మూలధనం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. రాష్ట్రం పట్ల మీ దృష్టి భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గణనీయమైన పెట్టుబడులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో అభివృద్ధి, శ్రేయస్సు కోసం మీ నాయకత్వంలో రాష్ట్రంతో భాగస్వామ్యాన్ని కొనసాగించడానికి తాము ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.