NEWSTELANGANA

సీఎంను క‌లిసిన అనిల్ కుమార్

Share it with your family & friends

రాజ్య స‌భ స‌భ్యుడిగా ఎన్నిక

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు (రాజ్యసభ) సభ్యునిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. కుటుంబ స‌మేతంగా క‌లుసుకుని ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న తండ్రి అంజ‌న్ కుమార్ యాద‌వ్. గ‌తంలో ఎంపీగా ఉన్నారు. హైద‌రాబాద్ లో కీల‌క‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

ఈ సంద‌ర్బంగా రాజ్య స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాద‌వ్ ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా తాజాగా ఏఐసీసీ హైక‌మాండ్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అంతా భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ అజ‌హ‌రుద్దీన్ తో పాటు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డికి అవ‌కాశం ఇస్తార‌ని అనుకున్నారు.

అయితే ఇటీవ‌ల ఎమ్మెల్యే టికెట్ ల‌భించింది అజ్జూ భాయ్ కి. కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. త‌ను కూడా చివ‌రి దాకా ప్ర‌య‌త్నం చేశారు ఎంపీ సీటు కోసం. కానీ హైక‌మాండ్ వారికి మొండి చేయి చూపించింది. అంజ‌న్ కుమార్ యాద‌వ్ కు బ‌దులు ఆయ‌న త‌న‌యుడు అనిల్ కుమార్ యాద‌వ్ కు ఛాన్స్ ఇచ్చింది.