ఈసీ తీరుపై అనుమానం
అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
నెల్లూరు జిల్లా – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరించిన తీరుపై తీవ్ర ఆవేదన చెందారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. కేవలం తమపై పనిగట్టుకుని ఆరోపణలు చేయడం, చర్యలు తీసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఓటమి చెందుతామనే భయంతోనే మాచర్లలో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎనిమిది చోట్ల పోలింగ్ బూత్ లలో విధ్వంసం జరిగితే కేవలం మాచర్ల లోనే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. దీనికి ఎవరు సహకరించారో, ఎవరు వీడియోను లీక్ చేశారో చెప్పాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా కావాలని వైసీపీ సర్కార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు చేసిన ప్రయత్నం అని మండిపడ్డారు.
ముందు ఈవీఎం దృశ్యాలను ఎవరు బయట పెట్టారో చెప్పాలన్నారు. ఈసీ తీరుపై తమకు అనుమానం ఉందన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.