రజనీకాంత్ కెరీర్ లో సూపర్ సాంగ్
అవుతుందన్న మ్యూజిక్ డైరెక్టర్
హైదరాబాద్ – లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న తలైవా రజనీకాంత్, మంజూ వారియర్ కలిసి నటిస్తున్న వేట్టైయాన్ చిత్రం వచ్చే నెల అక్టోబర్ లో దసరా పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. తన డిఫరెంట్ మేనరిజంతో మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్.
భారీ తారాగణంతో పాటు సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం. తలైవాకు సంబంధించి అనిరుధ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న నాలుగో చిత్రం వేట్టైయాన్ కావడం విశేషం.
ఇప్పటికే విడుదల చేసిన మనసాలియో సాంగ్ దుమ్ము రేపుతోంది. చిన్నారులు, యూత్, వృద్దులు సైతం పాటకు స్టెప్పులు వేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది..కనిపిస్తోంది. ఈ సందర్బంగా సెప్టెంబర్ 20న చెన్నై లోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్ కాబోతోంది. అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు. పేట్టా, దర్బార్, జైలర్ తర్వాత వేట్టైయాన్ నాలుగో సినిమా కావడం విశేషం.
రజనీకాంత్ సినీ కెరీర్ లో ఈ చిత్రం , సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నాయని స్పష్టం చేశాడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్.