DEVOTIONAL

తిరుమ‌ల స‌న్నిధిలో అనిత వంగ‌లపూడి

Share it with your family & friends

తెలుగు వారు బాగుండాల‌ని కోరుకున్నా

తిరుమ‌ల – ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడి శ‌నివారం తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ద‌ర్శ‌నం సంద‌ర్బంగా ఆల‌య అధికారులు స్వాగ‌తం ప‌లికారు.

అంత‌కు ముందు త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే కొండ పైకి న‌డిచి వ‌స్తాన‌ని మొక్కుకున్నారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి. ఈ సంద‌ర్బంగా ఆమె తిరుప‌తి అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమ‌ల‌కు చేరుకున్నారు. భారీ భ‌ద్ర‌త మధ్య ఆమె మెట్ల ద్వారా న‌డిచారు.

అనంత‌రం హోం శాఖ మంత్రికి తిరుమ‌ల లోని ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహాన్ని కేటాయించారు. ఈ సంర‌ద్బంగా మంత్రికి పోలీసులు గౌర‌వ వంద‌నం చేశారు. అనంత‌రం వారాహి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.

శ‌నివారం స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం వంగ‌ల‌పూడి అనిత తిరుమ‌లకు వ‌చ్చిన భ‌క్తులను ప‌రామ‌ర్శించారు. టీటీడీ అంద‌జేస్తున్న వ‌స‌తి సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.