ప్రకటించిన హొం శాఖ మంత్రి వంగలపూడి
విశాఖపట్నం – సింహాచలం అప్పన్న నృసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన భక్తులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. వారి కుటుంబంలో ఒకరికి సర్కార్ ఉద్యోగం ఇస్తామన్నారు. తక్షణమే సాయం అందజేస్తామని ప్రకటించారు. ప్రతిపక్షం రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జరిగిన ఘటనపై సీఎం త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. నివేదిక వచ్చేసరికి 2 రోజుల సమయం పడుతుందన్నారు.
ఘటనకు సంబంధించి తీవ్ర సంతాపం తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. వెంటనే విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పూర్తి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరైనా తప్పు చేసినా, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు సీఎం. చనిపోయిన వారు ఏ పార్టీ అయినా నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అనుకోని జరిగిన ఘటనపై రాజకీయం చేయొద్దని సూచించారు. ఇది మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. చావులకు పార్టీలు ముడి పెట్టొద్దన్నారు.